కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల విద్యార్థుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతా

by velandi.Saikiran |

కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాల విద్యార్థుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతానని కాపు కార్పొరేషన్ చైర్మన్

కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల విద్యార్థుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతా
X

దిశ, ఏపీ బ్యూరో : కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాల విద్యార్థుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతానని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి పేర్కొన్నారు. విదేశీ విద్యా పథకం క్రింద అర్హులై ఉన్నత విద్య అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళిన కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలకు చెందిన విద్యార్దినీ, విద్యార్దుల తల్లిదండ్రులు బుధవారం తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుని కలిసి తమ సమస్యలను వివరించారు. ఆనంతరం చైర్మన్ తో వారు మాట్లాడుతూ విదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన తమ పిల్లలకు విడుదల చేయవలిసిన విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, తమ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి బకాయి నిధులను విడుదల చేయవలిసిందిగా చైర్మన్ కి ఆర్జీలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Next Story