- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమండ్రిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. వృద్ధురాలిని ఈడ్చి, కిందపడేసి గొలుసు చోరీ
by Ramesh Naini |
రాజమండ్రిలో చైన్ స్నాచర్లు బరితెగించారు. దానవాయిపేట పార్క్, లాలా చెరువు సర్వీస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వరుస చోరీలకు పాల్పడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాజమండ్రిలో చైన్ స్నాచర్లు బరితెగించారు. దానవాయిపేట పార్క్, లాలా చెరువు సర్వీస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వరుస చోరీలకు పాల్పడ్డారు. మంగళవారం ఓ ఇంటి ముందున్న వృద్ధురాలిని సమాచారం అడిగే నెపంతో సమీపించిన ఓ నిందితుడు.. ఆమెపై దాడి చేసి, ఈడ్చుకెళ్లి కిందపడేసి మరీ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ దారుణ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మరో ఘటనలో, ఉదయం వాకింగ్ ముగించుకుని వస్తున్న మహిళ మెడలోంచి కూడా మూడు కాసుల బంగారు గొలుసును దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story






