- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Minister: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు
విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కుమారస్వామి(Central Minister Kumaraswamy) కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కుమారస్వామి(Central Minister Kumaraswamy) కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మరో మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu)తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సవాలుగా తీసుకున్నాం.. ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. దేశంలో నెంబర్-1గా నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. విశాఖ ఉక్కుపై రూ.35 వేల కోట్ల రుణభారం ఉందని తెలిపారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇది మొదటి ప్యాకేజ్ అని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఒడిశాలో సొంత గనులున్నాయి.. కానీ అక్కడ ఇంకా మైనింగ్ మొదలు కాలేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి సీఎం చంద్రబాబు(Chandrababu) కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది చారిత్రాత్మకమైన రోజు అని తెలిపారు. ప్రధాని మోడీ(PM Modi)కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపివేత అని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా వైజాగ్ వాసుల్లో ప్రత్యేక స్థానం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు.






