- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతి చర్చల్లో పాల్గొన్న మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్!
మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్(chhattisgarh) లోని బీజాపూర్(Beejapur Encounter) జిల్లాలో నేడు మరో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మి సింహాచలం(Tenthu Lakshmi simhachalam) అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందాడు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సింహాచలం అలియాస్ సుధాకర్‌పై రూ.కోటి రివార్డు ఉంది. 2004 ప్రభుత్వంతో శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు. కాగా, ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ఎన్‌కౌంటర్‌లలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత కేశవరావు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఎన్‌కౌంటర్‌లో మరో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మరువక ముందే.. ఇవాళ మరో ఎన్‌కౌంటర్ జరగడం.. అగ్రనేత గౌతమ్ మృతిచెందడం హాట్ టాపిక్‌గా మారింది.






