- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News : ఏపీకి మరో రెండు ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం
ఏపీ(AP)కి మరో గుడ్ న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)కి మరో గుడ్ న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు ప్రధాన ప్రాజెక్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(MP Pemmasani Chandra Shekhar) నేడు ప్రకటించారు. ఇది ఏపీ రాజధాని అమరావతి(Amaravathi) నిర్మాణంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్‌లలో మొదటిది- రూ.1,329 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్(GPRA) క్వార్టర్స్ నిర్మాణం. రెండోది- రూ.1,458 కోట్ల వ్యయంతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణం.
ఈ రెండు ప్రాజెక్ట్‌లకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం అమరావతిని పరిపాలనా కేంద్రంగా బలోపేతం చేయడంతో పాటు, రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తుందని పలువురు కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2018లో గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్‌లు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలో నిలిచిపోయాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌లు మళ్లీ ఊపందుకున్నాయని అన్నారు. కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం అమరావతిలో కేంద్ర సంస్థల స్థిరీకరణకు, సెక్రటేరియట్ భవనం కేంద్ర-రాష్ట్ర పరిపాలనా సమన్వయానికి దోహదపడనున్నాయి.






