Atrocious: వీడియోలు చూస్తుండగా చేతిలో పేలిన సెల్ ఫోన్.. చిన్నారి పరిస్థితి..!?

by Disha Web Desk 3 |
Atrocious: వీడియోలు చూస్తుండగా చేతిలో పేలిన సెల్ ఫోన్.. చిన్నారి పరిస్థితి..!?
X

దిశ వెబ్ డెస్క్: సెల్‌ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్ మాట్లాడడం, వీడియోలు చూడడం, చాటింగ్ చేయడం వంటి పనులు చేయకూడదని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా, అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కొందరిలో మార్పు రావడం లేదు. సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి వాడడం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వాడడం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు.

తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. చేతిలో సెల్‌ఫోన్ పేలడం కారణంగా ఓ బాలికకు తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, ఎమ్మాజీగూడెంలో ఓ చిన్నారి చేతిలో సెల్‌ఫోన్ పేలింది. ఈ ఘటనలో బాలిక కుడిచేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు వేళ్ళు పూర్తిగా తెగిపోయాయి.

అలానే బాలిక పొట్ట భాగంలో కూడా గాయాలు అయ్యాయి. దీనితో బాలిక తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చిన్నారి తల్లిదండ్రుల సమాచారం ప్రకారం.. బాలిక సెల్‌ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.



Next Story

Most Viewed