AP News : కూటమి ప్రభుత్వం ఏడాది పాలన.. సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP)ల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది.

AP News : కూటమి ప్రభుత్వం ఏడాది పాలన.. సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP)ల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ సదర్భంగా కూటమి సర్కార్ ఏడాది పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. 'సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్'(Good Governance- SwarnandhraPradesh) పేరుతో గురువారం సాయంత్రం మంగళగిరిలో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ మేరకు సీఎస్ విజయానంద్(CS Vijayanand) ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొననున్నారు. ఈ సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తూ సీఎస్ ఉత్తర్వులు విడుదల చేశారు.

Next Story