శ్రీశైలంలో సీడీవో బృందం..డ్యామ్‌ను పరిశీలించిన అధికారులు

by Malleboina Mahesh |

కృష్ణా నదిపై ఉన్న అతి పెద్ద జలాశయాల్లో శ్రీశైలం ఒకటి. ఈ డ్యామ్ వర్షకాలంలో పూర్తిగా నిండితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

శ్రీశైలంలో సీడీవో బృందం..డ్యామ్‌ను పరిశీలించిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నదిపై ఉన్న అతి పెద్ద జలాశయాల్లో శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) ఒకటి. ఈ డ్యామ్ వర్షకాలంలో పూర్తిగా నిండితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే తాగు నీటితో పాటు, రెండు రాష్ట్రాల అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాగా కొద్ది కాలంగా ఈ శ్రీశైలం జలాశయంలో లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్యామ్ దిగువన ఉన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్‌ భారీ వరద కారణంగా దెబ్బ తిన్నాయి. దీంతో భారీ గుంత ఏర్పడటంతో.. డ్యామ్ సేఫ్టీ పై కొద్ది రోజులుగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న సీడీవో బృందం ఈ రోజు శ్రీశైలం చేరుకుంది. డ్యామ్ దిగువన దెబ్బతిన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. అలాగే డ్యామ్ దిగువన ఏర్పడిన ప్లంజ్ పూల్ గుంతను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. దీంతో పాటుగా నిపుణుల బృందం డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వల వివరాలు, పలు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Next Story