సీబీఐ ముందుకు సునీత.. YS వివేకా హత్య కేసులో కీలక పరిణామం

by Satheesh |
సీబీఐ ముందుకు సునీత.. YS వివేకా హత్య కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో వేగం పెంచిన సీబీఐ.. తాజాగా హత్యకు ముందు వివేకా రాసిన లేఖపై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్‌లను ప్రశ్నిస్తోంది. సీబీఐ ఆదేశాలతో ఇవాళ విచారణకు హాజరైన సునీత దంపతులను సీబీఐ విచారిస్తోంది.

ఇక, ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు సునీత దంపతులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీబీఐ. వారిని ఇవాళ మరోసారి విచారణకు పిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సైతం ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల నేడు విచారణకు హాజరకాలేనని సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీబీఐ.. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Read more:

వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన పులివెందులకు ఆ ముగ్గురు వ్యక్తులు

Viveka Case: అవినాశ్‌రెడ్డికి మళ్లీ నోటీసులు | CBI officials again issued notices to Kadapa MP Avinash Reddy

Next Story

Most Viewed