- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేక హత్య కేసులో నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు
తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు చేపట్టాలని ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు చేపట్టాలని ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీత తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివేకానంద రెడ్డి హత్య వెనుక కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదన్నారు. సీబీఐ హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేయలేదని తమ క్లయింట్ సునీత పిటిషనులో పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం బాధితురాలు, సీబీఐకి మధ్య ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అందరి వాదనలు విన్న తర్వాతే కేసు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు.
పిటిషన్ విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు కేసులో నిందితులైన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డితో పాటు ఇతర నిందితులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, దస్తగిరి (అప్రూవర్)లకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పై వివరణ ఇస్తూ అక్టోబరు 27లోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.






