YS Sharmila:‘TDP పంజరంలో ACB బందీ అయ్యింది’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-05 08:52:01  IST  )

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila:‘TDP పంజరంలో ACB బందీ అయ్యింది’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) ఆమె ACB కార్యాలయం వద్ద పంజరంతో.. మీడియాతో మాట్లాడారు. ఏసీబీ ని వీడుదల చేయండని వైఎస్ షర్మిల కోరారు. అదానీ-జగన్ 1750 కోట్ల ముడుపుల పై వెంటనే ACB దర్యాప్తు జరిపించాలని కోరారు. అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది. సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యింది అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది అని తెలిపారు. ఆధారాలు కూడా బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా? ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు ? 2021లో ప్రతిపక్షంలో ఉన్న TDP ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేశారు. ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు.

రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం అని ఆరోపణ చేశారు. అదానీ డీల్ వెనుక అవినీతి జరిగిందని తెలుసు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా అన్నారు. అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు? అని షర్మిల ప్రశ్నించారు. జగన్ కి నష్టం లేదు.. మీకు నష్టం లేదు. నష్టం జరిగేది.. రాష్ట్ర ప్రజలకు మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ తో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుంది. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది. రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు. సోలార్ పవర్ రెట్లు తగ్గుంటుంటే.. మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు ? 2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు. అని వైఎస్ షర్మిల ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ACBకి ఫిర్యాదు చేసింది.. దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసిందని అన్నారు. ACB స్వయం ప్రతిపత్తి గల సంస్థ.. కానీ రాష్ట్రంలో ACBనీ బందీ చేశారు. పంజరంలో చిలక మాదిరిగా బందీ చేశారని ఆమె పేర్కొన్నారు.

Next Story