YS Sharmila : ఏపీలో కూడా కులగణన చేపట్టాలి : వైఎస్.షర్మిల

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ రాష్ట్రంTelangana Stateలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనCaste census దేశానికే(Ideal for the Country)ఆదర్శమని..ఇదో చారిత్రాత్మక ఘట్టమని..ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రశంసించారు.

YS Sharmila : ఏపీలో కూడా కులగణన చేపట్టాలి : వైఎస్.షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంTelangana Stateలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనCaste census దేశానికే(Ideal for the Country)ఆదర్శమని..ఇదో చారిత్రాత్మక ఘట్టమని..ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రశంసించారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ(Rahul Gandhi)దూరదృష్టికి తెలంగాణ కులగణన నిదర్శనమని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాల(Caste Census In AP)ని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu Naidu)ను డిమాండ్ చేస్తున్నామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతుందన్నారు. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని.. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలని..మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలని..జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని షర్మిల డిమాండ్ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని ఆరోపించారు. ఆ సర్వే నివేదిక బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని.. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని షర్మిల ఆరోపించారు. ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోందన్నారు. బీజేపీ ఉచ్చులో పడకుండా ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రలో కూడా వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

Next Story