ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు చెల్లవు.. తెలుగు ప్రజల ద్రోహి బాబు : మంత్రి అంబటి

by Disha Web Desk 21 |
ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు చెల్లవు.. తెలుగు ప్రజల ద్రోహి బాబు : మంత్రి అంబటి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ద్రోహి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఏపీ రైతాంగం పాలిట ద్రోహి అని మండిపడ్డారు. అంతేకాదు మన నీటికి తెలంగాణ దగ్గర ‘కీ’ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. మన నీటిని వాడుకోవటానికి తెలంగాణ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడుక్కునే విధంగా చంద్రబాబు మన హక్కును తాకట్టు పెట్టి, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా, అమరావతికి పారిపోయి వచ్చాడు అని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆంధ్రాలో టీడీపీకి ప్రజలు సమాధి కట్టబోతున్నారు అని ఆరోపించారు. తెలంగాణలో తమకు ఇంట్రస్టులు లేవని ఎవరు వచ్చినా.. తమకు ఒకటేనని చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వం వస్తే.. ఆ ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత తమపైన ఉంటుంది అని స్పష్టం చేశారు. చంద్రబాబు పోయినసారి బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు అన్నీ తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మీటింగ్‌లలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వస్తే.. కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు సమాంతరంగా ఎగిరాయి అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులు చెల్లవు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటుందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. వాస్తవానికి బతికున్నా, చచ్చిపోయినట్లేనని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు... ఆ పార్టీ శ్రేణులు ప్రవర్తన వల్ల, వ్యక్తులు, సామాజిక వర్గాల ప్రవర్తన వల్ల, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కూకటివేళ్ళతో ఆంధ్రప్రదేశ్‌లో పెకలించబోతున్నారు అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆంధ్రా పోలీసులపై తెలంగాణ వారు పెట్టిన కేసు చెల్లదని అన్నారు. ఏపీ పోలీసులు నేరం చేశారనుకుంటే.. వారు ఎక్కడ చేశారు..? ఏపీలో నేరం చేస్తే.. తెలంగాణ పోలీసులు కేసు పెడతారా..? అని ప్రశ్నిచారు. తాను కూడా మొన్న ఖమ్మం జిల్లా వెళితే.. తనపై తెలుగుదేశానికి చెందిన కుల వాదులు కొందరు దాడికి ప్రయత్నం చేస్తే.. తెలంగాణలో పోలీసులు కేసు పెట్టారు. ఇది వాస్తవం అని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. ‘మా హక్కుల్ని మేము కాపాడుకుంటున్నాం.. తెలంగాణ వారి హక్కుల్ని మేం హరించం. భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుంది. చంద్రబాబు తాకట్టు పెట్టిన హక్కును మళ్ళీ మనం తీసుకునే ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed