Breaking:రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు.. ఇద్దరిపై కేసు నమోదు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-09 04:24:52  IST  )

ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో అమరావతి పై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Breaking:రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు.. ఇద్దరిపై కేసు నమోదు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో అమరావతి పై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమరావతి రైతుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడరని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజధాని మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజధాని మహిళలు పోలీస్ స్టేషన్‌లో నిన్న(ఆదివారం) ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో రాజధాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్‌రావు పై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. వారి పై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్‌రావులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.

అయితే.. ఓ మీడియా ఛానల్‌లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్ట్ కృష్ణంరాజును ఆపకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చలు కొనసాగించారు. ఈ ఘటన పై ఏపీ మంత్రులు, సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని సీఎం చంద్రబాబు రీసెంట్‌గా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Next Story