మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు

by Muthe.Rajitha |

వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి నియోజక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నెల్లూరు జిల్లా వెంకటాచలం పీఎస్ లో ఫిర్యాదు అందడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసారు పోలీసులు. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రాధాకృష్ణమనాయుడు ఈ ఫిర్యాదు చేసారని సమాచారం. కాగా ఇటీవల దిత్వా తుఫాను నేపథ్యంలో సోమిరెడ్డి రైతులను నిర్లక్ష్యం చేసారంటూ కాకాణి శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే నకిలీ మద్యం కేసులో ఫైళ్లు మాయం చేసారని కాకాణిపై ఆరోపణలున్నాయి.

Next Story