పీకల్లోతు నీటిలో శవాన్ని మోస్తూ.. అంత్యక్రియలు

by Muthe.Rajitha |

ఏపీలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

పీకల్లోతు నీటిలో శవాన్ని మోస్తూ.. అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కుండపోత వర్షాలకు నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె గ్రామంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం గ్రామానికి చెందిన షాజహాన్ అనే యువకుడు నదిలో ఈతకు వెళ్లి మృతిచెందాడు.

అయితే నేడు షాజహాన్ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వారి స్మశానం నదికి అవతల ఉండటంతో తప్పనిసరై ప్రాణాలు అడ్డుపెట్టి పీకల్లోతు నీటిలో తాబూత్(శవాన్నిఉంచేది) మోస్తూ అవతలివైపు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దీనస్థితికి గ్రామస్థులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Next Story