- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News : తుంగభద్ర కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
by Muthe.Rajitha |
తుంగభద్ర(Tungabhadra) నదిలో ఘోర కారు ప్రమాదం(Car Accident) జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తుంగభద్ర(Tungabhadra) నదిలో ఘోర కారు ప్రమాదం(Car Accident) జరిగింది. కర్నూలు(Karnul) జిల్లాలోని కైతాళం సమీపంలో తుంగభద్ర దిగువ కాలువ (కర్నూలు-కడప కాలువ)లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని హుబ్లీకి చెందిన సునీల్ (22), మణికంఠ (23) మృతి చెందగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నలుగురు స్నేహితులు రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వెళ్ళి హుబ్లీకి తిరిగి వస్తుండగా, డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల కారు కెనాల్‌లో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కైతాళం ఎస్‌ఐ రాజశేఖర్ SDRF దళాల సహాయంతో రెండు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరిని రక్షించారు. మిగతా ఇద్దరి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






