రైతాంగ సమస్యలపై.. క్యాబినెట్ సబ్ కమిటీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

by Thanuru Gopichand |   (  Updated:2025-05-20 09:10:58  IST  )

వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రైతాంగ సమస్యలపై.. క్యాబినెట్ సబ్ కమిటీ..   కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేస్తుంది. ఈరోజు జరిగిన ఏపీ క్యాబినెట్‌లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందన్నారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు వివరించారు. రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై చర్చ జరిగింది. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Next Story