Ap News: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-05 15:12:00  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరిగింది...

Ap News: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర..!
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ(Cabinet Meeting) జరిగింది. ఉదయం 11 జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖ పంచగ్రామాల సమస్య(Visakha Panchagrama problem)పై శాశ్వత పరిష్కారం చూపించాలనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత కేబినెట్‌లో పరిష్కారం మార్గం చూపించినప్పటికీ భూములకు సంబంధించి ప్రత్యామ్నాయంపై ఆమోద ముద్ర పడలేదు. ఈ భేటీలో ఆ భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించిన 44 వేల 776 కోట్ల రూపాలయ విలువైన 15 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

అలాగే ఈ నెలఖారులో జరిగే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా ఈ కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో జరిగబోయే రెండు పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చించనున్నారు. ఎన్నికల వ్యూహాలపైనా ఆయా జిల్లాల మంత్రులు, ఇంచార్జి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలికి సంబంధించి ప్రత్యేక కమిషన్ రేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందని కూటమి నేతలు అంటున్నారు. చూడాలి మరి.

Next Story