- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న పనుల వేగవంతంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్న సీఎం.

దిశ, వెబ్ డెస్క్ : నేడు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధ్యక్షతన కేబినెట్ భేటీ (Cabinet Meeting) జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో (Velagapudi Secreteriat) ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనాపరమైన పలు కీలక నిర్ణయాలపై మంత్రి వర్గం చర్చించనుంది. అదే విధంగా ప్రాముఖ్యం కలిగిన అంశాలకు ఆమోదం తెలపనుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 నిమిషాలకు సచివాలయానికి చేరుకుంటారని, అనంతరం కేబినెట్ సమావేశంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం భోజన విరామం తరువాత పర్యావరణ శాఖ అధికారులతో సీఎం భేటీ అవుతారు. 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై చర్చ జరుపుతారు. పచ్చదనం పెంపుదల, అటవీ విస్తీర్ణంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ వెంటనే సాయంత్రం 04.00 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న, నూతనంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న పనుల వేగవంతంపై అధికారులకు కీలక సూచనలు చేస్తారు. రోజంతా వివిధ సమీక్షలు, అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 06.45 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి తన నివాసానికి చేరుకోనున్నారు.






