- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cabinet Expansion: ఆశావహులకు బ్యాడ్ న్యూస్.. మంత్రివర్గ విస్తరణ లేనట్లే?
రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదని తెలుస్తోంది.

దిశ, ప్రతినిధి గుంటూరు: రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదని తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబును మంత్రి వర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావించారు. ఆ మేరకు ఆయనను ఎమ్మెల్సీని కూడా చేశారు.
ఉగాది తరువాత అనుకున్నా..
ఉగాది తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కొందరు ఆశావహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. తాజాగా, మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే వద్దని సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఏకాభిప్రాయంతోనే నిర్ణయం..
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. ఈలోపే మంత్రి వర్గ విస్తరణ చేపట్టి కొందరు మంత్రులను తొలగిస్తే అసమ్మతి రాజుకుంటుందనే అభిప్రాయానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్‌కు రాంగ్ సిగ్నల్స్ వెళతాయని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఒక్క నాగబాబు కోసం ఏడాదిలోపు ఇంత డిస్టర్బెన్స్ అవసరమా? అని చర్చించుకున్న ఇద్దరు నేతలు ప్రస్తుతానికి విస్తరణ చేపట్టకూడదని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కొంత కాలం గడిచిన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి గురించి ఆలోచిద్దామని, అప్పటి వరకు పార్టీ బాధ్యతలలో కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడినట్లు సమాచారం.






