మావోయిస్టులను చంపి ఎన్‌కౌంటర్లు అంటున్నారు: కేంద్రప్రభుత్వంపై బీవీ రాఘవులు ఫైర్

by Vemula.Srinu Prasad |

మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బీవీ రాఘవులు మండిపడ్డారు..

మావోయిస్టులను చంపి ఎన్‌కౌంటర్లు అంటున్నారు: కేంద్రప్రభుత్వంపై బీవీ రాఘవులు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టుల(Maoists) పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(CPM Politburo member B.V. Raghavulu) మండిపడ్డారు. చర్చలకు సిద్ధమన్న మావోయిస్టులను పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని రాఘవులు మండిపడ్డారు. ఇటీవల జరిగింది ఎన్ కౌంటర్లు కాదని, అంతా బూటకమని ఆయన ఆగ్రహం చేశారు.. చర్చలకు సిద్ధమైనా సరే చంపేస్తామనే తీరును కేంద్రం వ్యవహిరిస్తోందని ధ్వజమెత్తారు. యుద్ధం మావోయిస్టులపై కాదని, గిరిజననులపై అని రాఘవులు వ్యాఖ్యానించారు. అటవీ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని, అందువల్లనే గిరిజనులను అడవి నుంచి పంపించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చట్టాలతో కార్మిక హక్కులు లేకుండా చేశారన్నారు. ఈ నెల 26న చేపట్టే బంద్‌కు సీపీఎం తరపున పూర్తిగా మద్దతు ఇస్తున్నామని బీవీ రాఘవులు పేర్కొన్నారు.

Next Story