టీటీడీకి విరాళం అందించిన వ్యాపారి

by Thanuru Gopichand |

గిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ సనత్ కుమార్ రెండ్ల టీటీడీ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తూ భారీ విరాళాన్ని అందించారు.

టీటీడీకి విరాళం అందించిన వ్యాపారి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన గిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) సనత్ కుమార్ రెండ్ల టీటీడీ (TTD) సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తూ భారీ విరాళాన్ని అందించారు. మంగళవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్‌ బీఆర్ నాయుడును (BR Naidu) ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 11.5 లక్షలు, బర్డ్ (BIRRD) ట్రస్ట్‌కు రూ. 11.5 లక్షల చొప్పున మొత్తం రూ. 23 లక్షలకు సంబంధించిన విరాళాల డీడీలను అందజేశారు. ఈ విరాళం ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పేదల వైద్య సేవలకు తమ వంతు సహకారం అందించినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నామని సనత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ సనత్ కుమార్ సేవా దృక్పథాన్ని అభినందిస్తూ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులు అందించే ఇటువంటి విరాళాలు నిరుపేద రోగులకు ప్రాణదానం చేయడంలోనూ, అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. సనత్ కుమార్ తోపాటు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆకాంక్షించారు.

Next Story