వరద ప్రవాహంలోకి బస్సు.. 50 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లాలో బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది..

వరద ప్రవాహంలోకి బస్సు.. 50 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District)లో బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో కురిసిన వర్షానికి పల్లె చెరువు(Palle Cheruvu)కి ఉధృతి పెరిగింది. దీంతో ఉయ్యాలవాడ మండలం మాయలూరు సమీపంలో బ్రిడ్జి మీదుగా వరద ప్రవాహం(Flood Flow) కొనసాగుతోంది. అయితే ప్రవాహంలోనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)ను నడిపేందుకు డ్రైవర్(Driver) యత్నించారు. దీంతో బ్రిడ్జి మధ్యలో బస్సు ఆగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. జేసీబీ సాయంతో ప్రయాణికులను రోడ్డుపైకి తీసుకొచ్చారు.

Next Story