- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ టూ హైదరాబాద్.. బస్సెక్కితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లు ప్రయాణికులను దోచుకోవడం కామన్ అయిపోయింది. ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ టికెట్ ధర తమకు నచ్చినంత పెంచి దోచుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లు ప్రయాణికులను దోచుకోవడం కామన్ అయిపోయింది. ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ టికెట్ ధర తమకు నచ్చినంత పెంచి దోచుకుంటున్నారు. అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా, తనిఖీలు నిర్వహించినా ఊరికివెళ్లేటప్పుడు టికెట్ ధరలు పెంచడం సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు సైతం టికెట్ ధరలు భారీగా పెంచి ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ముచేసుకుంటున్నాయి.
తాజాగా సంక్రాంతికి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లినవాళ్లు తిరిగి రావాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. విజయవాడ నుండి హైదరాబాద్ ఏసీ స్లీపర్ టికెట్ రూ.2700లకు అమ్ముతున్నారు. అంతే కాకుండా సెమీ స్లీపర్ రూ.1700లకు అమ్ముతున్నారు. మరోవైపు విజయవాడ నుండి బెంగుళూరు వెళ్లాలంటే ఏకంగా రూ.4వేలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుండి ఎక్కడికైనా దూరాన్ని బట్టి నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో అర్జెంట్ గా వెళ్లాల్సిన ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితిలో అడిగినంతా ఇవ్వాల్సి వస్తోంది.






