- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు ప్రమాదం.. పెండింగ్ చలాన్లు చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 21 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 21 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతోపాటు, బైకర్ రాంగ్ రూట్లో రావడం కూడా కారణమేనని తెలుస్తోంది. బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ బైక్ ను ఢీ కొట్టిన వెంటనే బస్సును ఆపకుండా 300 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల నిప్పు రవ్వలు చెలరేగి, మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి.
మంటలు చెలరేగిన వెంటనే వాటిని ఫైర్ ఎస్టింగ్విషర్ పరికరాలతో ఆర్పకుండా.. నీటితో ఆర్పే ప్రయత్నం చేశారని, దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో హైడ్రాలిక్ తీగలు తెగిపోయి, దాంతో మెయిన్ డోర్ తెరుచుకోలేదని ఈ కారణంగానే ఇరవై మందికి పైగా అగ్నికి ఆహుతయ్యారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటల్లో చిక్కుకున్న ప్యాసింజర్లను కాపాడకుండా ఇద్దరు డ్రైవర్లు బస్సును వదిలి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా పెండింగ్ చలాన్లు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 23 వేల 120 రూపాయల విలువైన 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పైన బస్సుపై చలాన్ లు 2024 జనవరి 27 నుండి 2025 అక్టోబర్ 9 మధ్య ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని... తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించిందని అందుకే ఫైన్ విధించినట్టుగా చెబుతున్నారు. అంతేకాదు మితిమీరిన వేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్ నిబంధనల ఉల్లంఘనల పైన కూడా చలాన్లు నమోదు అయినట్టుగా అధికారులు వెల్లడించారు. అలాగే సదరు ట్రావెల్ సంస్థ బస్సులపై సంబంధిత వెబ్సైట్ లో నెగెటివ్ రివ్యూస్ ఉండటం గమనార్షం.






