బస్సు ప్రమాద ఘటన.. పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-12 09:30:11  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 9 మంది మరణించారు.

బస్సు ప్రమాద ఘటన.. పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 9 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదిత్య దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్ స్వయంగా స్పాట్‌కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భద్రాచలం ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నారు. అదేవిధంగా పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల సాయం అందనుంది.

Next Story