- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cock Fighting: కోడి పందేలులో బంపర్ ప్రైజ్ కొట్టేశాడు...!(Video Viral)
కోడి పందేలులో కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి బంపర్ ప్రైజ్ కొట్టేశాడు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో కోడి పందేలు(Cock Fighting) జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి(Sankranti) సందర్భంగా శిబిరాలు ఏర్పాటు చేసి మరీ కాయ్ రాజా కాయ్ రాజా అంటున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో యదేచ్ఛగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు.. అయితే ఈసారి పందెం రాయుళ్లకు నిర్వాహకులు సర్ ప్రైజ్ బహుమతులు అందిస్తున్నారు. పందెంలో గెలిస్తే కార్లు, బైకులతో పాటు ఇతర వాహనాలను ఇస్తున్నారు. దీంతో బెట్టింగులు కోట్లలో జరుగుతున్నాయి. వేలకు వేలు పందేలు కాస్తున్నారు. ఇలా పండగను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఓ వ్యక్తి వరుసగా నాలుగు పందేలు గెలిచారు. దీంతో ఆయనకు కొత్త బుల్లెట్ బైక్ దక్కింది. ఈ మేరకు బుల్లెట్ తీసుకుని నడుపుకుంటూ వెళ్లిపోయారు. సమీప ఆలయం వద్ద పూజలు చేయించి తన గెలుపునకు గుర్తుగా బైకుతో ఊరంతా తిరిగారు. తమ కోళ్లు నాలుగు పందేలను గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కోడి పందెం గెలిచి బుల్లెట్‌పై రయ్ రయ్ అంటూ తిరుగున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో వరుసగా నాలుగు కోడిపందాలు కొట్టి బుల్లెట్ బండిని గెలుచుకున్నాడు... pic.twitter.com/hkX4LQru7Y
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) January 13, 2025






