తెలుగు రాష్ట్రాల ప్రజలకు బంపరాఫర్.. రూ.2 వేలకే పంచారామాల టూర్ ప్యాకేజ్

by Kema Shiva Kumar |

కార్తీక మాసం సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బంపరాఫర్.. రూ.2 వేలకే పంచారామాల టూర్ ప్యాకేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కార్తీక మాసం సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులు ఒకే రోజులో రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా స్పెషల్ బస్సు సర్వీసులతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ప్యాకేజీకి కనీస ధర రూ.2,000‌గా నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే సర్వీసులను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండనంది.

కాగా, ఈ యాత్రలో ఒకేరోజు రాష్ట్రంలోని ఐదు పంచారామ క్షేత్రాలైన అమరావతి (అమరారామం), భీమవరం (సోమారామం), పాలకొల్లు (క్షీరారామం), ద్రాక్షారామం (భీమారామం), సామర్లకోట (కుమారారామం) లోని శివాలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. పవిత్ర కార్తీక మాసంలో భక్తులు సులభంగా, తక్కువ ఖర్చుతో పంచారామాల దర్శనం చేసుకునేందుకు ఈ ప్యాకేజీ బంపరాఫర్ అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 27, నవంబర్‌ 3, 10, 17 తేదీల్లో ప్రతి సోమవారం విజయవాడలోని ఏపీ టూరిజం కార్యాలయం నుంచి బస్సులు బయల్దేరతాయని ఏపీటీడీసీ తెలిపింది. రూ.2130, పిల్లలకు రూ.1760 చొప్పున టికెట్‌ ధరను నిర్ణయించారు. బుకింగ్‌ల కోసం www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Next Story