ఎడ్లబండ్ల పోటీలు.. గుర్రంపై వచ్చిన మంత్రి

by Muthe.Rajitha |

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఎడ్లబండ్ల పోటీలకు మంత్రి కందుల దుర్గేష్ గుర్రంపై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎడ్లబండ్ల పోటీలు.. గుర్రంపై వచ్చిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఎడ్లబండ్ల పోటీలకు మంత్రి కందుల దుర్గేష్ గుర్రంపై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. జిల్లాలోని రంగంపేట మండలం వడిసెలేరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గన్ని జగన్నాథరావు ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిముఖ్య అతిథిగా పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గుర్రంపై వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన పోటీలను అధికారికంగా ప్రారంభించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

వడిసెలేరు ఎడ్లబండ్ల పోటీలు గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ కార్యక్రమంగా పేరుగాంచగా, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ–గుంటూరు ప్రాంతాల నుంచి డజన్ల కొద్దీ ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. తెలుగు సంస్కృతి, గ్రామీణ జీవనశైలికి ప్రతీకగా నిలిచే ఈ పోటీలతో గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకోగా.. ప్రజలు, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Next Story