- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుగ్గ మఠం భూముల కేసు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మరో నలుగురు వ్యక్తులు బుగ్గ మఠం భూములను ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (Peddireddy Ramachandra Reddy), మరో నలుగురు వ్యక్తులు బుగ్గ మఠం భూములను ఆక్రమించారని (Encroachment of Bugga Math lands) ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములు చంద్రగిరి రాజులు మతపరమైన, స్వచ్ఛంద ప్రయోజనాల కోసం దానం చేసినవిగా చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. సర్వేనెంబర్ 261/1, 261/2లో 3.88 ఎకరాల బుగ్గమఠం భూమిని ఆక్రమించి, ఆ ప్రాంతాన్ని కంచె వేసి ప్రజల సంచారాన్ని నియంత్రించారని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆరోపించింది. కాగా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. విచారణకు త్రిసభ్య కమిటీని వేసిన విషయం తెలిసిందే.
కాగా ఈ భూమల ఆక్రమణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుగ్గ మఠం భూముల కేసు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy Ramachandra Reddy)కి బిగుస్తున్న ఉచ్చు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఆక్రమణ భూమిలో బుగ్గ మఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదికను త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి అందజేసింది. బుగ్గ మఠం భూముల విషయంలో క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు అటవీ చట్టాల ప్రకారం (As per forest laws) చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.






