- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి జోగి రమేష్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్లసీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న (Buddha Venkanna) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న సాయంత్రం ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో జోగి రమేష్ (Jogi Ramesh) చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన విమర్శించారు. “జోగి రమేష్‌కు దమ్ము లేదని బుద్ధా వెంకన్న తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల వెలుగులోకి వచ్చిన కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారని ఆరోపించారు. “కల్తీ మద్యం తయారీకి జోగి రమేషే ఆదేశాలు ఇచ్చారని, విచారణలో జనార్ధన్‌రావు ఇప్పటికే దానిని ఒప్పుకున్నారని, ఈ కేసులో జోగి రమేష్ అరెస్ట్ అవడం ఖాయమని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
అలాగే, జోగి రమేష్ వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారని, అగ్రిగోల్డ్ ఆస్తులను బెదిరింపులతో రాయించుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఆయన మాటలను నమ్మరని బుద్ధా వెంకన్న అన్నారు. ఇటీవల చంద్రబాబు నివాసం వద్ద జరిగిన నిరసనపై స్పందిస్తూ గతంలో “మాజీ ముఖ్యమంత్రి ఇంటికి నిరసన తెలపడానికి వెళ్లిన వారు రాళ్లు ఎందుకు తీసుకువెళ్లారని? అది నిరసన కాదు, దాడేనని, మేము కూడా జగన్ ఇంటికి వెళ్లి ఇలాగే వ్యవహరించాలా అని ఈ సందర్భంగా బుద్ధా ప్రశ్నించారు.






