- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిటెక్ విద్యార్థినిపై అదే కాలేజీ విద్యార్థి ఘాతుకం
విశాఖపట్నంలో దారుణమైన ఘటన. కళాశాలలో విద్యార్థినిల భద్రతపై నీలి నీడలు.

దిశ, వెబ్ డెస్క్: విశాఖ అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో (Avanti Engineering College) బిటెక్ చదువుతున్న విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థి చేతిలో భౌతిక, మానసిక క్షోభకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం ఓ విద్యార్థిని అవంతి కాలేజీలో బిటెక్ చదువుతోంది. ఆమెకు అదే కాలేజీలో ఎంసీఏ చదువుతున్న దిలీప్ అనే విద్యార్థి ఇన్ స్టాగ్రామంలో పరిచయం అయ్యాడు. ఇరువురు తరచూ చాటింగ్ చేస్తూ, ఫోనులో మాట్లాడుకునేవారు. జనవరి 21న దిలీప్ సదరు విద్యార్థిని ప్రపోజ్ చేశాడు. తనతో మాట్లాడాలని అదే రోజు సాయంత్రం విద్యార్థిని హాస్టల్ వద్దకు వెళ్లాడు. ఆమెను బలవంతంగా తనతో పాటు బండిపై బయటకు తీసుకెళ్లాడు. భీమిలి బీచ్ వద్ద ఆమెపై దాడికి యత్నించాడు. నొప్పితో బాధపడుతుంటే హాస్టల్ వద్ద దించుతానని చెప్పి రాళ్లవలసలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి భౌతికంగా హింసించాడు. అంతేకాకుండా అసభ్యకరమైన రీతిలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. అంతటితో ఆగకుండా విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఫోటోలు, వీడియోలు కాలేజీ గ్రూప్ లో పెడతానని బెదిరించాడు. అదే రోజు రాత్రి 11.30 గంటలకు తిరిగి హాస్టల్ వద్ద దించాడు.
మరుసటి రోజు నీకు నాకు సంబంధం లేదని.. మళ్లీ తన లైఫ్ లోకి రావొద్దని, వస్తే ఫోటోలు, వీడియోలు కాలేజీ గ్రూప్ లో పెడతానని బెదిరించినట్లు విద్యార్థిని ఫిర్యాదు చేసిందన్నారు. బాధితురాలు భీమిలి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే దిలీప్ ను అరెస్టు చేస్తామని విశాఖపట్నం సీపీ తెలిపారు.






