- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య.. మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్
ఒంగోలు జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. ఒంగోలు, పద్మ టవర్స్ లోని ఆయన ఆఫీసులో ఉండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకొని వచ్చి అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులను దిగ్ర్భ్రాంతికి గురి చేసింది. వీరయ్య చౌదరిని చంపిన వారిని పట్టుకొని కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత హత్యపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ (Minister Nara Lokesh) వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన.. సంతనూతలపాడు నియోజకవర్గం (Santhanuthalapadu Constiency) టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య (TDP Leader Veeraiah Choudary Murder) వార్త షాక్ (Shock) కు గురిచేసిందని అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణమని అన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారని గుర్తు చేసుకున్నారు. అలాగే హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. టీడీపీ నేత హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేగాక హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.






