రాష్ట్రంలో తీవ్ర కలకలం.. వ్యక్తి దారుణ హత్య

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-12 05:22:26  IST  )

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది.

రాష్ట్రంలో తీవ్ర కలకలం.. వ్యక్తి దారుణ హత్య
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. తాగునీటి కుళాయి వద్ద జరిగిన గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గుంతకల్లుకు చెందిన కురుబ చంద్ర అనే వ్యక్తిపై అదే వీధికి చెందిన శివ అనే వ్యక్తి వేట కొడవలితో దాడి చేశాడు.

అనంతరం శివ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో రక్తపు మడుగులో కొట్టుకున్న చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాగునీటి విషయంలో చెలరేగిన వివాదం కారంణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story