- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు: పీవీఎన్ మాధవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ అన్నారు.

దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ అన్నారు. మంగళవారం బీచ్ రోడ్‌లోని బీజేపీ నగర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ అరాచక పాలన చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో నడిపిస్తాను అంటే నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరన్నారు. రూ. 5 లక్షల కోట్లు అప్పుల ఉబిలో ఉండి స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తానని అనడం హాస్యాస్పదం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించడానికే రాష్ట్ర ప్రజలకు నేతలు మాయమాటలు చెబుతున్నారన్నారు.
తెలంగాణ విభజన సమయంలో కేసీఆర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. కేసీఆర్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టాలి అంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. జీవో నెంబర్ 124 ద్వారా ఆంధ్రాలోని నిరుద్యోగులు తెలంగాణలో పోటీ పరీక్షలకు హాజరు కాకుండా చేశారని విమర్శించారు. రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టి స్టీల్ ప్లాంట్ కాపాడవచ్చు కదా అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- BRS
- PVN Madhav
- BJP






