- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింఛన్ డబ్బుల కోసం తమ్ముడు హతం!
సోదర బంధాన్ని అపహాస్యం చేసిన పింఛన్ సొమ్ము.

దిశ, వెబ్ డెస్క్ : రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే. తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి. ఆ మాట నిజమేమో అనిపిస్తుంది మనసును కలచివేసే ఈ ఘటన చూస్తే. పింఛన్ డబ్బుల కోసం తమ్ముడిని చంపాడు ఓ అన్న. ఈ బాధాకరమైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం రాజు, బుల్లి సత్తాలు (40) అన్నదమ్ములు. బుల్లి సత్తాలు మానసిక దివ్యాంగుడు. అతనికి ప్రభుత్వం తరపున నెలవారీ పింఛన్ వస్తుంది. అయితే పెద్దవాడైన రాజు సత్తాలును డబ్బుల కోసం తరచూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో సత్తాలు నుంచి పింఛన్ డబ్బులను అన్న అయిన రాజు లాక్కునే ప్రయత్నం చేశాడు. సత్తాలు ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్న అతను దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మానసిక దివ్యాంగుడైన సత్తాలు ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More..
భార్య కాపురానికి రావడం లేదని ఘాతుకం.. ఇద్దరు పిల్లలకు ఉరేసి తండ్రి ఆత్మహత్యాయత్నం






