- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు మృతి
విశాఖ జిల్లా గాజువాక అగనంపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాళ్లపారాణి ఆరకముందే నవవధువు మృతి చెందింది. బుధవారం రాత్రి పెళ్లి తరవాత వరుడు నర్సింగరావు, వధువు రాజేశ్వరి వాడచీపురుపల్లి నుండి అత్తగారిల్లు అయిన అగనంపూడి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా గాజువాక అగనంపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాళ్లపారాణి ఆరకముందే నవవధువు మృతి చెందింది. బుధవారం రాత్రి పెళ్లి తరవాత వరుడు నర్సింగరావు, వధువు రాజేశ్వరి వాడచీపురుపల్లి నుండి అత్తగారిల్లు అయిన అగనంపూడి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తజంట ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ పోల్ కు వేగంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో పెళ్లి కూతురు తీవ్రగాయాలతో అక్కడే మరణించగా వరుడికి సైతం తీవ్రగాయాలయ్యాయి.
కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాతృలను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పెళ్లైన మరుసటి రోజే రోడ్డు ప్రమాదం జరగటం ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లై ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టేందుకు వెళుతున్న వధువు ఆశలన్నీ మధ్యలోనే ఆవిరయ్యాయి. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






