- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: మంత్రిపై దాడి చేసిన ఎద్దు.. తృటిలో తప్పిన ప్రమాదం, స్వల్ప గాయాలు
by Kema Shiva Kumar |
మంత్రి బాలవీరాంజనేయ స్వామిపై ఎద్దు గాడి చేసి గాయపడిచిన ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి బాలవీరాంజనేయ స్వామిపై ఎద్దు గాడి చేసి గాయపడిచిన ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు మంత్రితో సహా, టీడీపీ నేతలు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నాయకులు, యువత, మంత్రితో ఫోటోలు దిగేందుకు ఎదగబడ్డారు. దీంతో అక్క ఏర్పాటు చేసిన డీజే సౌండ్ ఎఫెక్ట్‌కు ఎద్దులు బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాశాయి. అనంతరం మంత్రి కింద పడిపోగా ఆయనపై ఎద్దు ముందుకాళ్లతో బలంగా తొక్కింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఎద్దులను పక్కకు తప్పించారు. తూర్పునాయుడుపాలెంలోని నివాసానికి చేరుకున్న మంత్రి బాలవీరాంజనేయ స్వామకి డాక్టర్లు చికిత్స చేశారు.
Next Story






