బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో ఘోర రైలు ప్రమాదం!

by Geesa Chandu |

విజయవాడకు బయలుదేరిన ధర్మవరం రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ట్రైన్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చేరుకోగానే.. ట్రైన్ లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో ఘోర రైలు ప్రమాదం!
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడకు బయలుదేరిన ధర్మవరం రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ట్రైన్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చేరుకోగానే.. ట్రైన్ లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలు బోగీ కింది భాగం నుండి వ్యాపించినట్టు సమాచారం. ట్రైన్ ప్రొద్దుటూరు ప్లాట్ ఫాం చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మంటలను గమనించి, రైలు లో ఉన్న ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణీకులు వెంటనే రైలు నుండి బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. తర్వాత రైల్వే సిబ్బంది తేరుకొని మంటలను ఆర్పడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో ప్రయాణీకులకు ఉపశమనం లభించింది. తర్వాత రైల్వే సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు జరుపుతామని రైల్వే అధికారులు వెల్లడించారు.

Next Story