- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఈ సారి ఎందుకంటే?
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై మొత్తం మూడు హత్నాయత్నం కేసులు నమోదయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై మొత్తం మూడు హత్నాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో అరెస్ట్ భయపడిన పిన్నెల్లి బ్రదర్స్ కొన్ని రోజులు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగారు. ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే, ఆయన అరెస్ట్‌కు న్యాయస్థానం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగుస్తుండటంతో పిన్నెల్లిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా కాసేపటి క్రితం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్పీ ఆఫీసులో సంతకం పెట్టేందుకు అక్కడికి చేరుకున్నారు. అనంతరం మళ్లీ తన ఇంటికి వెళ్లిపోయారు.
Next Story






