- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: విశాఖలో ఫ్లైయింగ్ స్వ్కాడ్ తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్ల నగదు సీజ్
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 నుంచి ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో ఫ్లైయింగ్ స్వ్కాడ్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఓ కారు పాండురంగాపురం వైపు వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా రూ.1.5 కోట్ల నగదును అందులో గుర్తించారు. అనంతరం పోలీసులు కళ్లు గప్పి నగదును తరలిస్తున్న నిందితులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి గురించి గాలిస్తున్నారు.
Next Story






