- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: పండగ పూట జనసేనకు బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా
పండుగ పూట జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బీవీ రావు ఆ పార్టీ కాసేపటి క్రితం రాజీనామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పండుగ పూట జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బీవీ రావు ఆ పార్టీ కాసేపటి క్రితం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్‌కు పంపినట్లుగా పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాను అవిశ్రాంతంగా పని చేస్తున్నానని బీవీ రావు తెలిపారు. 2019లో కైకలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ తనకు సీటు ఇచ్చారని, దాదాపు 11 వేల ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కాగా, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్‌లో భాగంగా కైకలూరు టికెట్‌ను బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కేటాయించారు. ఈ క్రమంలోనే బీవీ రావు బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. పొత్తులో భాగంగా కేవలం టీడీపీని కలుపుకుని పోతున్నారని, జనసేనలో కొందరిని వారి వెంట తిప్పుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే.. కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ఆయన హెచ్చరించారు.






