- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC Strike: ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సమ్మెకు బ్రేక్.. చర్చలు సఫలం
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘాలు ప్రకటించిన సమ్మెకు బ్రేక్ పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘాలు ప్రకటించిన సమ్మెకు బ్రేక్ పడింది. ఈ నెల 12 నుంచి సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అద్దె బస్సుల యజమానుల ప్రధాన డిమాండ్లను ఈ నెల 20 లోపు పరిష్కరిస్తామని ఎండీ హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు యజమానుల సంఘాలు ప్రకటించాయి. స్త్రీశక్తి పథకం కింద నడుపుతున్న ఐదు రకాల బస్సులకు నిర్వహణ భారం పెరిగిందని, అందుకు అనుగుణంగా అదనపు మొత్తాన్ని చెల్లించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయని, బస్సుల బీమా కవరేజ్ విషయంలోనూ పలు సమస్యలు ఎదురవుతున్నాయని వారు ఎండీ దృష్టికి తీసుకువచ్చారు.
రవాణాశాఖ మంత్రితో చర్చలు..
డిమాండ్లపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రవాణాశాఖ మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అద్దె బస్సుల యజమానుల ఐదు ప్రధాన డిమాండ్లను ఈ నెల 20లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎండీ హామీ మేరకు ఈ నెల 12 నుంచి చేపట్టాల్సిన సమ్మెను విరమించుకుంటున్నట్లు అద్దె బస్సుల యజమానులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు.






