వీధి కుక్కలపై అమితమైన ప్రేమ.. బాలుడి జీవితం విషాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-03 13:10:11  IST  )

వీధి కుక్కులతో సరదాగా ఆడుకున్న బాలుడు మృతి చెందారు..

వీధి కుక్కలపై అమితమైన ప్రేమ..  బాలుడి జీవితం విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: కుక్కల(Dogs)తో సరదాగా ఆడిన ఆట బాలుడి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లా దుప్పుతూరు(Dupputuru)లో చోటు చేసుకుంది. దుప్పుతూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు గుడియా పూర్ణానంద్‌(Child Gudiya Purnanand)కు వీధికుక్కులంటే అమితమైన ప్రేమ. స్కూలు నుంచి వచ్చిన వెంటనే వీధి కుక్కలతో ఆడుకునేవాడు. ఆ సమయంలో కుక్కల గోళ్లు... బాలుడికి గీసుకునేవి. వాటిని పట్టించుకులేదు.

స్కీనింగ్ టెస్టులో బాలుడికి రెబీస్

అయితే గ్రామంలో జరిపిన స్కీనింగ్ టెస్టులో బాలుడికి రెబీస్ సోకినట్లు బయటపడింది. ఒళ్లంతా కుక్క విషం ఎక్కినట్లు చెప్పారు. దీంతో రెండు సార్లు రెబీస్ ఇంజెక్షన్ చేయించుకున్నారు. మూడో ఇంజెక్షన్ వేయించుకులేదు. కొద్ది రోజులకు పూర్ణానంద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రెండు, మూడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది. రెబీస్ వ్యాధితో జనవరి 2న బాలుడు మృతి చెందారు. వీధి కుక్కలపై ఉన్న ప్రేమ.. బాలుడి ప్రాణం తీయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన పూర్ణానంద్ తనకు తెలియకుండానే రెబీస్ వ్యాధి బారిన పడ్డారు. దీంతో పెంపుడు కుక్కల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కుక్కలకు కచ్చితంగా వ్యాక్సిన్లు వేయించాలని అంటున్నారు.

Next Story