- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం కాలువ వద్ద బాలుడి మృతదేహం.. పోలీసులు వెళ్లే లోపే మాయం
పోలవరం కాలువ వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) ఏటికొప్పాక(Etikoppaka)లో దారుణం జరిగింది. పోలవరం కాలువ(Polavaram Canal) వద్ద బాలుడి మృతదేహం(Child Dead Body) కనిపించింది. దీంతో స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు బాలుడి మృతదేహం ఫొటోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లేలోపే బాలుడి మృతదేహం కనిపించలేదు. కానీ రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో స్థానికంగా గాలించారు.
పొదల్లో మృతదేహం
అయితే కొండకింద పొదల్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడి శరీరంపై గాయాలండటంతో నాటు తుపాకీతో కాల్పి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ‘‘అయితే బాలుడు ఎవరు..?. ఎందుకు చంపారు. నిందితులెవరు..?’’ అనే కోణంలో విచారణ చేపట్టారు. త్వరగా కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.






