- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాలు బయటపడతాయనే పారిపోయారా?: బొత్స సత్యనారాయణ
తిరుమల లడ్డూ అంశంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి ప్రాంగణంలో ఆయన మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ అంశంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూపై చర్చ చేపట్టాక ప్రభుత్వం స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పారని, దేవ దేవుడు మిమ్మల్ని క్షమించరని మండిపడ్డారు. మీ దోపిడీని దేవుడు చూస్తున్నాడని.. ఊరుకోడని హెచ్చరించారు. లడ్డూపై చర్చకు రాకుండా ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. చర్చ జరిగితే హెరిటేజ్ నిజాలు బయటపడతాయనే పారిపోయారా అని అన్నారు. హెరిటేజ్-ఇందాపూర్ మధ్య సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించారు. మీ దోపిడీని ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు అంటూ వ్యాఖ్యానించారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా తొక్కిసలాట జరిగిందా అని అన్నారు. ఎప్పుడైనా తొక్కిసలాట జరిగి టీటీడీలో భక్తులు చనిపోయారా అని అడిగారు. చంద్రబాబుకు సీఎం కుర్చీపై ఉన్న శ్రద్ధ దేవుడు, దేవాలయాలపై లేదని విమర్శించారు.






