- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్.. సిటీ న్యూరో ఆస్పత్రిలో కొనసాగుతోన్న చికిత్స
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు గురువారం అర్ధరాత్రి దాటాక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈ మేరకు ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో నిపుణులైన న్యూరో సర్జన్లు, వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్సను అందించారు. మెదడులో రక్త ప్రసరణ, ఇతర పారామీటర్లను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన శరీరం స్పందింస్తోందని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్స ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Next Story






