- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఫైర్ అయ్యారు. రైతుల దుస్థితి, ప్రభుత్వ భూముల కేటాయింపు అంశాలపై అధికార కూటమిపై మాజీ మంత్రి బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, "రైతులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి పంటలు పండించాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది," అని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం ఇప్పటికీ రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రైతులకు ఎప్పుడు సాయం చేస్తారో కూటమి నేతలు స్పష్టం చేయాలని ఈ సందర్భంగా బొత్స డిమాండ్ చేశారు.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బొత్స సత్యనారాయణ భూముల కేటాయింపు విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. "చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. "ప్రజల ఆస్తులను, ప్రజా ధనాన్ని కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని బొత్స మండిపడ్డారు. రైతులు నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు, రైతులు ఆగ్రహంతో ఉన్నారని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
- Tags
- andrpradesh






