రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-20 14:14:48  IST  )

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఆరవ అదనపు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పీటీ వారెంట్ పై అనంతపురం జైలు నుండి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఆరవ అదనపు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పీటీ వారెంట్ పై అనంతపురం జైలు నుండి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. పెదకాకాని సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదింరించిన కేసులో అనిల్ కు రిమాండ్ విధించారు. 2016 మే 9న తన స్థలానికి సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వాలని అనిల్ కుమార్ సర్వేయర్‌ను బెదిరించాడు. దీంతో సర్వేయర్ మల్లిఖార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అనిల్ కుమార్ గత 8 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ పై అనంతపురం జైలు నుండి గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. మే 3వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Next Story